ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ఆడియో లీక్ కావడంతో మీడియా, సోషల్ మీడియాలో MLA ఆడియో పెద్ద ఎత్తున హల్ చల్ చేయడం తెలిసిందే. అభ్యంతరాల ఓటర్ల జాబితాలో మన పార్టీ వాళ్ళవి అయితే ఎలాగైనా ఓట్లు చేర్చాలన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. బిఎల్వోలను పిలిపించి మాట్లాడాలని, వాలంటీర్ల సహాయం తీసుకొని వేరే పార్టీ ఓట్లు తొగించాలని ఆదేశాలు ఇవ్వడం ఆ ఆడియో లో ఉంది.

MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దొంగ ఓట్లతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడని ఆలా జరగకుండా ఓటర్ల వెరిఫికేషన్ పక్కాగా జరగాలని జనసేన నాయకులు కావలి RDO గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
